సోమవారం 25 మే 2020
National - Mar 29, 2020 , 20:45:04

ల‌క్నో జైలు నుంచి 38 మంది ఖైదీల విడుద‌ల‌

ల‌క్నో జైలు నుంచి 38 మంది ఖైదీల విడుద‌ల‌

ల‌క్నో: క‌రోనా మ‌హ‌మ్మారి ఖైదీల పాలిట వ‌రంగా మారింది. ఇదివ‌ర‌కు ఎంత మొర‌పెట్టుకున్నా ఖైదీల‌కు పెరోల్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌య్యేది. కానీ ఇప్పుడు క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా జైలు అధికారులే పిలిచి మ‌రీ ఖైదీల‌ను పెరోల్‌పై వారి ఇండ్ల‌కు పంపిస్తున్నారు. దీంతో జైళ్ల నుంచి విడుద‌లువుతున్న‌ ఖైదీలు, వారి కుటుంబ‌స‌భ్యులు సంతోషం వ్య‌క్తంచేస్తున్నారు. 

కాగా, రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 71 జైళ్ల నుంచి ఏడేండ్ల లోపు జైలుశిక్షప‌డిన 11,000 మంది ఖైదీల‌ను ద‌శ‌ల వారీగా విడుద‌ల చేయాల‌ని ఇటీవ‌లే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణయించింది. అందులో ల‌క్నో జైలు నుంచి కూడా 600 మంది ఖైదీల‌ను 8 వారాల పెరోల్ పై  విడుద‌ల చేయాల్సి ఉంది. ఈ మేర‌కు శ‌నివారం 52 మంది ఖైదీల‌ను విడుద‌ల చేశారు. తాజాగా ఆదివారం మ‌రో 38 మంది ఖైదీల‌ను వ‌దిలిపెట్టారు.       


logo