Airports | సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేత
భారత్-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడులు చేస్తుండటంతో పౌర విమానాల రాకపోకలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిషేధం విధించింది.
ఢిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడులు చేస్తుండటంతో పౌర విమానాల రాకపోకలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిషేధం విధించింది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని మొత్తం 32 విమానాశ్రయాలను (Airports) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15 వరకు ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి ఎలాంటి విమానాల రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపినట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది.
దీంతో అధంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతీపురా, భటిండా, బికనేర్, భూజ్, చంఢీగఢ్, హల్వారా, హిండన్, జమ్ము, జామ్‌నగర్, జోథ్‌పూర్, జైసల్మేర్, కండాలా, కాంగ్రా, కేషోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి, లేహ్, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్, సర్సావా, శ్రీనగర్, షిమ్లా, తోయ్‌స్, ఉత్తర్లాయ్ ఎయిర్‌పోర్టులను ఈనెల 15 వరకు మూసి ఉంచనున్నారు. కాగా, ఈ నెల 8 వరకు 24 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ గతంలో ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో దానిని మే 15 వరకు పొడిగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

