Amazon Forest | అమెజాన్ అడవుల్లో 3 వేల ఏండ్ల కిందటి మహానగరం
ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవుల్లో 3 వేల ఏండ్ల కిందటి మహానగరాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండ్లు, విపణి ప్రదేశాలు, సారవంతమైన నేలలతో విలసిల్లిన అపానో లోయలోని ఈ పురాతన నగరం రోడ్లు, కాలువల ద్వారా అనుసంధానమై ఉందని వారు వెల్లడించారు. లిడార్ అనే ప్రముఖ రిమోట్ సెన్సింగ్ పద్ధతి ద్వారా ఈ నగరాన్ని కనుగొన్నారు.
Amazon Forest | న్యూఢిల్లీ, జనవరి 12: ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవుల్లో 3 వేల ఏండ్ల కిందటి మహానగరాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండ్లు, విపణి ప్రదేశాలు, సారవంతమైన నేలలతో విలసిల్లిన అపానో లోయలోని ఈ పురాతన నగరం రోడ్లు, కాలువల ద్వారా అనుసంధానమై ఉందని వారు వెల్లడించారు. లిడార్ అనే ప్రముఖ రిమోట్ సెన్సింగ్ పద్ధతి ద్వారా ఈ నగరాన్ని కనుగొన్నారు.
‘అమెజాన్‌లో ఇదే పురాతనమైన ప్రాంతం. అమెజాన్ సంస్కృతులను చూసే దృక్కోణాన్ని ఈ నగరం మార్చేస్తుంది. చాలా మంది ప్రజలు చిన్న గుంపులుగా, బహుశా దిగంబరులై గుడిసెల్లో నివసిస్తూ భూమిని చదును చేస్తూ ఉండేవారు. మన పూర్వీకులు సంక్లిష్టమైన పట్టణ సమాజాల్లో నివసించారనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది’ అని ఈ అధ్యయన రచయితలు తెలిపారు. ఈ లిడార్ సర్వేను 2015లోనే నిర్వహించినా ఫలితాలను తాజాగా ప్రచురించారు. ఆనాటి ఈ ప్రాచీన నగరంలోని చెక్క భవనాల్లో చలి కాచుకొనే ప్రదేశాలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

