లక్నో: ఒక మహిళకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. తాజాగా రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. ముగ్గురు పిల్లలున్న ఆమె మతం మారింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్నది. (Woman Marries Class 12 Student) ఆ యువకుడి కుటుంబం కూడా వీరి వివాహానికి మద్దతు తెలిపింది. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. సైదాన్వాలిలో నివసిస్తున్న 30 ఏళ్ల షబ్నమ్‌కు తొలుత మీరట్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. మొదటి భర్తతో విడాకుల తర్వాత ఆ గ్రామానికి చెందిన తౌఫిక్‌తో ఆమెకు వివాహమైంది. అయితే 2011లో రోడ్డు ప్రమాదం వల్ల అతడు వికలాంగుడయ్యాడు.
కాగా, ముగ్గురు పిల్లల తల్లైన షబ్నమ్ తాజాగా 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి శివతో లవ్‌లో పడింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న వికలాంగుడైన భర్త తౌఫిక్‌కు ఆమె విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత హిందూ మతంలోకి మారింది. తన పేరును శివానీగా మార్చుకున్నది. బుధవారం స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం విద్యార్థి శివను పెళ్లాడింది.
మరోవైపు శివానీతో తన కుమారుడి పెళ్లిని శివ తండ్రి దాతారామ్ సింగ్ స్వాగతించాడు. తన కొడుకు నిర్ణయానికి తాను మద్దతు ఇస్తున్నానని తెలిపాడు. ఆ జంట సంతోషంగా ఉంటే తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పాడు. వారిద్దరూ కలిసి శాంతియుతంగా జీవించాలని మాత్రమే తాము ఆశిస్తున్నామని మీడియాతో అన్నాడు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి నిషేధిత చట్టం అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
शादी शुदा महिलायो को आख़िर हो क्या गया है ,सीमा हैदर के बाद अमरोहा की शबनम उर्फ़ शिवानी जो की 3 बच्चों की माँ ने 12वी के छात्र शिव से शादी कर ली,
शबनम ने अपना धर्म भी बदल लिया है अब वो शिवानी के नाम से जानी जाएगी,
सीमा हैदर अपने 4 बच्चों के साथ साथ आई थी,शबनम 3 के साथ #amroha pic.twitter.com/KxSX6nQNes
— Mahender Mahi (@MahendrMahii) April 9, 2025