కరోనా ఉగ్రరూపం: ఫస్ట్ వేవ్ కంటే ప్రమాదకరంగా సెకండ్ వేవ్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత ఏడాది విజృంభించిన ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నది. రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి రోజూ రెండు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఫస్ట్ వేవ్ సందర్భంగా ఏనాడూ ఒకేరోజు లక్ష కేసులు నమోదు కాలేదు. అయినా ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలను కచ్చితంగా పాటించారు.
కానీ ఇప్పుడు రోజూ రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయినా ప్రజలు యథేచ్చగా తిరుగుతున్నారు. కొందరైతే మాస్కులు కూడా ధరించడం లేదు. అయితే ప్రభుత్వాలు కూడా సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, బార్లు, రెస్టారెంట్లు సహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నాయి. దానివల్ల కూడా వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, వినియోగదారులు ఇండ్ల నుంచి బయటికి వస్తున్నారు. అందరూ అన్ని జాగ్రత్తలతో బయటకి వస్తే ప్రమాదం లేదుగానీ కొందరు మాత్రం మాస్కులు, సామాజిక దూరం అనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
కొత్త కేసులు అంతకంతకే పెరిగిపోవడానికి ప్రధాన కారణం కొంతమంది కరోనా వైరస్ తీవ్రతపై నిర్లక్ష్యంగా ఉండటమే. ఇదిలావుంటే సెకెండ్ వేవ్ కొవిడ్ బాధితుల్లో కొత్తకొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి సమస్యలు ఉంటున్నాయి. కళ్లు ఎర్రబారడం కూడా కొందరిలో కరోనా లక్షణంగా ఉంది. కళ్ల ద్వారా కూడా వైరస్ చేరడం వల్లనే కళ్లు ఎర్రబారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఫస్ట్ వేవ్‌లో కరోనా పసివాళ్లు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపగా సెకండ్ వేవ్‌లో మాత్రం యువతపైనే కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. కరోనా బారినపడిన వాళ్లలో 20 నుంచి 25 శాతం మంది యువత మాత్రమే ఉంటున్నారు. 20 నుంచి 35 ఏండ్ల మధ్య వయసు వారికే కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
కోవిడ్‌పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

