Dandvat Yatra: భార్యకు విడాకులు ఇచ్చి.. సాష్టాంగ నమస్కారం చేస్తూ 9 కిలోమీటర్ల యాత్ర.. వీడియో
Dandvat Yatra: డైవర్స్ ఇచ్చి దండవత్ యాత్ర చేపట్టాడు ఓ యువకుడు. విడాకులు మంజూరీ కావడంతో 9 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారం చేస్తూ జర్నీ చేపట్టాడు. జోగేశ్ అనే వ్యక్తి స్థానిక గ్రామ దేవతకు తన మొక్కు తీర్చుకున్నాడు. ఈ ఘటన యూపీలో జరిగింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ 25 ఏళ్ల యువకుడు తన భార్యకు విడాకులు ఇచ్చి ఆ సందర్భాన్ని భక్తితో సెలబ్రేట్ చేసుకున్నాడు. బస్తీ గ్రామానికి చెందిన జోగేశ్ అనే వ్యక్తి.. దండవత్ యాత్ర(Dandvat Yatra) చేపట్టాడు. సుమారు 9 కిలోమీటర్ల మేర సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ జర్నీ చేపట్టాడు. స్థానిక గ్రామ దేవత బైదా సామే మాతా ఆలయం వరకు ఆ వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు కదిలాడు. ఆ యాత్ర సమయంలో అతని పేరెంట్స్, మిత్రులు అతనికి సహకరించారు.
ఉదయం ఆరు గంటలకే ఇంటి నుంచి బయలు దేరిన ఆ వ్యక్తి 9 కిలోమీటర్ల దూరం చేరేందుకు సుమారు 12 గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది. 2022లో అతను పెళ్లి చేసుకున్నాడు. కానీ తరుచూ భార్యతో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో అతను విడాకులు దరఖాస్తు చేసుకున్నాడు. జనవరిలో అతనికి విడాకులు మంజూరీ అయ్యాయి. దీంతో అతను గ్రామదేవతకు మొక్కు తీర్చుకున్నాడు. స్థానిక పోలీసుల పహారాలో ఆ వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తూ యాత్ర కొనసాగించాడు.
At a time when divorce parties are emerging as a new hot invite, a 25-year-old man from Basti celebrated the personal milestone with a unique thanksgiving for the local deity.
Making the most of the auspicious occasion of Navratri, the newly-divorced man undertook a 9-km… pic.twitter.com/SZlQqvRMyn
— Hate Detector 🔍 (@HateDetectors) March 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Basti
- Dandvat Yatra
- divorce
- Jogesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

