2 వేల కరోనా భృతి

- మహిళలకు ఉచిత ప్రయాణం
- సీఎంగా ప్రమాణం చేసిన వేళ ప్రజలకు స్టాలిన్ వరాలు
- తనయుడు ఉదయనిధికి క్యాబినెట్లో దక్కని చోటు
చెన్నై, మే 7: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణాన్ని స్వీకరించారు. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్‌తో ప్రమాణం చేయించారు. సీఎం 33 మంత్రులతో క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో 15 మంది తొలిసారి మంత్రి పదవిని చేపట్టినవారు. ఇద్దరు మహిళలకు కూడా క్యాబినెట్లో స్థానం లభించింది. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. సీఎం స్టాలిన్ హోంశాఖ, సాధారణ పరిపాలన, దివ్యాంగుల సంక్షేమశాఖల బాధ్యతలు తీసుకొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్టాలిన్ కుటుంబసభ్యులతోపాటు, సోదరుడు అళగిరి కుమారుడు దయానిధి, మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీర్ సెల్వం హాజరయ్యారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే కూటమి 133 సీట్లలో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకొన్నది.
కరోనా భృతి
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే స్టాలిన్ తమిళనాడు ప్రజలకు కరోనా భృతి ప్రకటించి తన ఎన్నికల హామీని నెరవేర్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీకుటుంబానికి రూ.2వేలు ఆర్థిక సాయం అందించేందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆవిన్ పాల ధరను లీటరుకు రూ.3 తగ్గించారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రూ.1200 కోట్లు కేటాయించారు. మహిళలకు ఉచిత రవాణా శనివారం నుంచే అమల్లోకి రానున్నది.
గాంధీ, నెహ్రూ, స్టాలిన్..
తమిళనాడు క్యాబినెట్లో ఒక స్టాలిన్, ఒక గాంధీ, ఒక నెహ్రూ ఉండటం విశేషం. స్టాలిన్ స్వయంగా సీఎంకాగా, జౌళిశాఖ మంత్రిగా ఆర్ గాంధీ, పురపాలక మంత్రిగా కేఎన్ నెహ్రూ పదవులను చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
Revanth Reddy | పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే.. రేవంత్‌రెడ్డి తప్పడు ఆరోపణలు
Agricultural University | అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు
Panchayat Grading | పంచాయతీల్లో గ్రేడింగ్ గందరగోళం.. కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం!
Uttam Kumar Reddy | కార్యకర్తలకు న్యాయం జరుగలేదు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

