రాయ్‌పూర్: బీఫ్ అమ్ముతున్న ఇద్దరిని కొందరు వ్యక్తులు బెల్ట్‌తో కొడుతూ అర్ధ నగ్నంగా ఊరేగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 50 ఏళ్ల నర్సింగ్ దాస్, 52 ఏళ్ల రామ్నివాస్ మెహర్ కలిసి మంగళవారం ఒక గోనె సంచితో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. గమనించిన సుమిత్ నాయక్ అనే వ్యక్తి ఆ సంచిలో ఏం ఉన్నదని అడగ్గా గొడ్డు మాంసం ఉందని వారు చెప్పారు. దీంతో సుమిత్ తన అనుచురులతో కలిసి వారిద్దరిని అడ్డుకున్నాడు. అనంతరం బలవంతంగా వారి బట్టలు విప్పించారు. లోదుస్తులతో వారిని ఊరేగించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి బెల్ట్‌తో వారిని కొట్టాడు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తుల వద్ద ఉన్న 33.5 కేజీల గొడ్డు మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు.
కాగా, బీఫ్ కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అర్ధ నగ్నంగా ఊరేగించి బెల్ట్‌తో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని దారుణంగా ప్రవర్తించిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
#Chhattisgarh : गोमांस बेचने के आरोप में दो लोगों को गांववालों ने कपड़े उतारकर पीटा pic.twitter.com/mh68if7txK
— NDTV India (@ndtvindia) November 2, 2022