ISKCON : బంగ్లాదేశ్‌లో 17 ఇస్కాన్ బ్యాంక్ అకౌంట్లు సీజ్
ISKCON: ఇస్కాన్‌తో లింకున్న 17 అకౌంట్లను 30 రోజుల పాటు ఫ్రీజ్ చేయాలని బంగ్లాదేశ్ అధికారులు ఆదేశించారు. ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్నయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఢాకా: ఇస్కాన్(ISKCON)తో లింకున్న 17 అకౌంట్లను 30 రోజుల పాటు ఫ్రీజ్ చేయాలని బంగ్లాదేశ్ అధికారులు ఆదేశించారు. మాజీ సభ్యుడు చిన్నయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ను బ్యాన్ చేయాలని దాఖలైన పిటీషన్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఇస్కాన్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలని కోరుతూ వివిధ బ్యాంకులను బంగ్లాదేశ్ ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆదేశించింది. అక్టోబర్ 30వ తేదీన కృష్ణదాస్‌తో పాటు మరో 19 మందిపై చాటోగ్రామ్ కొత్వాల్ పోలీసు స్టేషన్లో దేశద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. చాటోగ్రామ్ మార్కెట్ ప్రాంతంలో హిందువులు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఎయిర్‌పోర్టులో దాస్‌ను అరెస్టు చేశారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

