ఆగస్టులో బ్రిక్స్ సమావేశాలు.. ఆతిథ్యమివ్వనున్న దక్షిణాఫ్రికా
బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు ఆగస్టులో జరుగనున్నాయి.
న్యూఢిల్లీ: ఈ ఏడాది బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు ఆగస్టులో జరుగనున్నాయి. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ ప్రకటించారు. 2011, ఏప్రిల్‌లో చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో దక్షిణాఫ్రికా తొలిసారిగా పాల్గొన్నది. గత సమావేశాలకు చైనా వేదికగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈ సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించారు.

బ్రిక్స్ కూటమిని 2009లో స్థాపించారు. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సభ్యులగా ఉన్నాయి. ఈ కూటమి మొదట బ్రిక్‌గా ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్ కూటమిగా రూపాంతరం చెందింది. కూటమిలోని దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటైంది. బ్రిక్స్ మొదటి సమావేశం 2009 జూన్‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌లో జరిగింది. 13వ బ్రిక్స్ సమావేశం 2021 సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో వర్చువల్‌గా జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BRICS summit
- china
- Durban
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

