బీజేపీది లక్షిత దాడి
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంపై మూకుమ్మడిగా 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా శుక్రవారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాయి.
- విపక్షాలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ దాడులు
- సుప్రీంలో బీఆర్ఎస్ సహా 14 విపక్ష పార్టీల పిటిషన్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంపై మూకుమ్మడిగా 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా శుక్రవారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాయి.
ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉసిగొల్పుతున్నట్టు పిటిషన్లో మండిపడ్డాయి. ఒకవేళ సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు మరుగునపడిపోతున్నట్టు ఆరోపించాయి. పీఎంఎల్ఏ వంటి ప్రత్యేక చట్టాల్లో కఠినంగా ఉన్న బెయిల్ నిబంధనలను మిగతా బెయిల్ షరతులతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశాయి. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ సహా 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం.. ఏప్రిల్ 5న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది.
పిటిషన్ వేసిన పార్టీలివే:
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, శివసేన (ఠాక్రే వర్గం), డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, జార్ఖండ్ ముక్తిమోర్చా, జేడీయూ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP government
- cbi
- ED
- Misuse
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

