Residential School | మధ్యప్రదేశ్ గురుకుల పాఠశాలలో 13 ఏండ్ల బాలుడిపై ప్యూన్ లైంగికదాడి.. అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు. రేవా జిల్లాకు చెందిన 13 ఏండ్ల బాలుడు సాత్నాలోని సరస్వతి విద్యాపీఠ్ (Saraswati Vidyapeeth) హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం బాగాలేకపోవడంతో బాధితులు క్లాస్‌లకు వెళ్లకుండా తన హాస్టల్ గదిలోనే ఉన్నాడు. అదే హాస్టల్లో ప్యూన్‌గా (Peon) పనిచేస్తున్న రవీంద్ర సేన్ (Raveendra Sen).. దీనిని అదనుగా భావించి బాలుడిపై లైంగిక దాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు. అనంతరం దీనిగురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.
అయితే జరిగిన సంఘటన గురించి ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో స్కూల్‌కు వెళ్లిన వారు.. విషయం గురించి ప్రిన్సిపాల్‌కు చెప్పాలనుకున్నప్పటికీ అతడు వారిని కలవడానికి తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో బాధితునితో సహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ 377 సెక్షన్‌తోపాటు, పోక్సో చట్టం (POCSO act) కింద కేసు నమోదుచేదేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

