పాట్నా: బీహార్‌లో జనం మానవత్వాన్ని మరిచి ప్రవర్తించారు. ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 ఏళ్ల బాలుడు మృతిచెందగా.. ఆ ట్రక్కు నుంచి చెల్లాచెదరుగా కిందపడిన చేపల్ని స్థానికులు లూటీ(Fish Loot) చేశారు. బాధిత వ్యక్తి రితేశ్ కుమార్ శవం ఒకవైపు ఉండగా, మరో వైపు చేపల్ని ఎత్తుకెళ్లేందుకు జనం తొందరపడ్డారు. అక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వలేకపోయారు. ఈ ఘటన సితామర్హి జిల్లాలో పప్రీ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న జాజిహట్ గ్రామంలో జరిగింది. ఏడో తరగతి చదువుతున్న రితేశ్ కుమార్.. మార్నింగ్ క్లాసులకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రితేశ్ కుటుంబసభ్యులు చేరుకోగా.. అక్కడ పరిస్థితి మరోలా కనిపించింది. ట్రక్కు వద్ద పడి ఉన్న చేపల్ని జనం ఎత్తుకెళ్తున్న ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
बिहार के सीतामढ़ी में एक स्कूली बच्चे को मछली लदे पिकअप वैन ने ठोकर मार दी। 7 वीं में पढ़ने वाले रितेश की वहीं मौत हो गई। रितेश की लाश सड़क पर थी और भीड़ मछली लूट कर भाग रही थी। pic.twitter.com/TgruKJqC5N
— Somu Anand (@SomuAnand_) January 16, 2026