Sabeer Bhatia | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలో నివసిస్తున్న పౌరులందరికీ విశిష్ట గుర్తింపు నంబర్ (యూఐడీ) జారీ కోసం చేపట్టిన ‘ఆధార్’ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనవసరంగా భారీ మొత్తాన్ని ఖర్చు చేసిందని ‘హాట్‌మెయిల్’ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా విమర్శించారు. కేవలం రూ.175.16 కోట్లతో పూర్తయ్యే ఈ పని కోసం ఏకంగా రూ.11,385 కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు.
ప్రఖర్ గుప్తా నిర్వహించిన ‘ప్రఖర్ కే ప్రవచన్’ టాక్‌షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆధార్’ ప్రాజెక్టును చేపట్టిన వ్యక్తి సాంకేతిక నిపుణుడు కాదని, ఆయనకు సాంకేతికత గురించి తెలియదని అన్నారు.