వివాహ వేడుకలో విషాదం.. బావిలో పడి 13 మంది మహిళలు మృతి
Kushinagar | ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 11 మంది మృతిచెందారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ జరుగుతున్నది. ఈ సందర్భంగా కొందరు మహిళలు, యువతులు బావి పైకప్పుపై నిల్చున్నారు. అయితే బరువు అధికమవడంతో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.
దీంతో అంతా బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారని పోలీసులు తెలిపారు. మరో 15 మందిని గ్రామస్తులు కాపాడరని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. క్షతగాత్రులను దవాఖానాకు తరలించామన్నారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.
#UPCM श्री @myogiadityanath जी ने कुशीनगर के नेबुआ नौरंगिया थाना क्षेत्र में कुएं में गिरने की दुर्घटना में लोगों की मृत्यु पर गहरा शोक व्यक्त किया है।
उन्होंने संबंधित अधिकारियों को तत्काल बचाव व राहत कार्य संचालित कराने तथा घायल लोगों का समुचित उपचार कराने के निर्देश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) February 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

