Road Accident | ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది కూలీలు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాలీలో ఉన్న 10 మంది కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాద ధాటికి ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా పక్కనున్న కాలువలో ఎగిరిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని వారణాసి ట్రామా సెంటర్ హాస్పిటల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ట్రాక్టర్ను ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ అభినందన్ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 13 మంది కూలీలు ఉన్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

