శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Feb 27, 2020 , 03:44:02

రైతు సంక్షేమానికి కృషి చేయాలి

రైతు సంక్షేమానికి కృషి చేయాలి

వనపర్తి రూరల్‌ : సింగిల్‌విండో డైరెక్టర్లు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. బుధవా రం మండలంలోని రాజనగరం సింగిల్‌విండో పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. చైర్మన్‌ విజయకుమార్‌, వైస్‌ చై ర్మన్‌ రఘునందన్‌రెడ్డిలను శాలువాతో సన్మానించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల చే ఎన్నుకోబడిన సభ్యులు నిరంతరం వారి మేలు కోసం పనిచేయాలని, రాజనగరం సహకార వ్యవసాయ పరపతి సంఘాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయంపై అన్ని రకాల సేవలను అం దించాలని తెలిపారు. సంక్షేమ ఫలాలను రైతులకందించేలా చూడాల్సిన బాధ్యత మీదేనన్నారు. రాజనగరం సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని డైరెక్టర్లకు సూచించారు. అనంతరం డైరెక్టర్లు ప్రమాణాస్వీకా రం చేశారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్‌ చై ర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, గొ ర్రెల కాపలాదారుల సంఘం చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, మాజీ ఎంపీపీ సతీశ్‌రెడ్డి, మాజీ ఎంపీటీ సీ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు విష్ణుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, రాజపేట, అచ్యుతాపురం, రాజనగరం రైతులు పాల్గొన్నారు.


logo