యువ ఓటర్లే కీలకం
నల్లగొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిల్లో ఓటర్ల తుది జాబితా ప్రకారం మొత్తం 14,26,480 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఈ నెల 31 వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం గడువు ప్రకటించిన విషయం తెలిసిందే.
- ఓటర్లలో 30-39 ఏండ్ల వారిదే హవా
- మొత్తం ఓటర్లలో 28.80శాతం వారే
- నడి వయస్కులు 32.88 శాతం
- తొలిసారి ఓటుహక్కు పొందిన వారు 48,909 మంది
- 80 ప్లస్ వయస్సు గల ఓటర్ల సంఖ్య 1.21 శాతం
- 40 ఏండ్లు దాటిన మహిళల ఓట్లే అధికం
- జిల్లాలో మొత్తం ఓటర్లు 14,26,480 మంది
నల్లగొండ జిల్లాలో తుది ఓటర్ల జాబితాలో 14,26,480 ఓటర్లు ఉన్నారు. అందులో ఎక్కువగా ఉన్నది 30-39 ఏండ్ల మధ్య వయస్సు వారే. తర్వాత 20-29 ఏండ్ల వారు ఉండగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 3.42శాతం. 40-49 వయస్సు గల వారు 19.42 శాతం ఉండడం విశేషం. ఇక 80 ఏండ్ల పై బడిన వారి సంఖ్య అతి తక్కువగా ఉన్నది. మొత్తం ఓటర్ల సంఖ్యలో ఇది 1.21శాతమే. ఇక 40 ఏండ్ల లోపు ఓటర్లలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటే 40 దాటిన వారిలో మహిళలే ఉండడం ఆసక్తిని కలిగిస్తున్నది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో వయస్సుల వారీగా పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్11(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిల్లో ఓటర్ల తుది జాబితా ప్రకారం మొత్తం 14,26,480 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఈ నెల 31 వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం గడువు ప్రకటించిన విషయం తెలిసిందే. నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు పది రోజుల ముందు వరకు ఓటర్ల దరఖాస్తులకు అవకాశం కల్పించింది. మరికొన్ని అదనపు ఓట్ల జత కావచ్చు. ఇక తాజాగా ఎన్నికల సంఘం వెల్లడించిన తుది జాబితాను ఓటర్ల వయస్సుల వారీగా విశ్లేషిస్తే మధ్య వయస్కులే ఎన్నికల్లో కీలకం కానున్నారు. 40 ఏండ్ల లోపు మొత్తం ఓటర్ల సంఖ్య 52.76 శాతంగా ఉంది. 40 నుంచి 59 ఏండ్ల వారి సంఖ్య కూడా 32.88శాతంగా తేలింది.
అత్యధికంగా 30-39 మధ్య వయస్సు వారే…
మొత్తం ఓటర్లలో 30-39 మధ్య వయస్సు వాళ్ల సంఖ్య 28.80శాతంతో 4,10,842 మంది ఉన్నారు. వీరి తర్వాత 20-29 ఏండ్ల మధ్య వాళ్లు 20.45 శాతంతో 2,91,768 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 40-49 మధ్య వయ స్సు వాళ్లు 19.42 శాతంతో 2,77,095 మంది ఉన్నారు. 50-59 ఏండ్ల లోపు వాళ్లు 13.46 శాతంతో 1,92,069 మంది ఉన్నట్లు తేలింది. ఇక 60-69 మధ్య వాళ్లు 8.59 శాతంతో 1,22,629 మంది, 70-79 మధ్య వాళ్లు 4.61శాతంతో 65,781 మంది, 80 ఏండ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్లు 1.21 శాతంతో 17,387 మంది ఉన్నట్లు తుది జాబితాలో వెల్లడైంది. ఇందులో తొలిసారి ఓటు హక్కును పొందిన వారు 3.42 శాతంతో 48,909 మంది యువ ఓటర్లు ఉన్నారు.
40 ఏండ్ల దాటి ఓటర్లలో మహిళలే ఎక్కువ
ఓటర్ల జాబితాలో పురుష, మహిళ ఓటర్ల సంఖ్యలో 40 ఏండ్ల లోపు వారిలో పురుషుల హవా ఉంటే 40 దాటిన ఓటర్లలో మహిళల సంఖ్య అధికంగా ఉంది. 40 ఏండ్లలోపు ఓటర్లలో పురుషుల సంఖ్య 385423 మంది ఉండగా మహిళలు 3,65,989 మంది ఉన్నారు. ఇద్దరి మధ్య తేడా 19,434గా ఉంది. అదే 40 ఏండ్లు దాటిన వారిని పరిశీలిస్తే 3,23,231 మంది పురుషులు ఉండగా 3,51,447 మంది మహిళలుగా తేలింది. ఇక్కడ 28,216 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీరిలో కూడా 50-59 ఏండ్ల మధ్యలో అత్యధిక వ్యత్యాసం 11వేల పైచిలుకు ఉండడం గమనార్హం. మొత్తం ఓటర్లలో గ్రామీణ ఓటర్లు సుమారుగా 11.37లక్షలు ఉంటే, అర్బన్ ఓటర్ల 2.87 లక్షలుగా ఉన్నట్లు అంచనా వేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


