Kaleshwaram Canal : భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు.
రాజాపేట, మార్చి 28 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం మాట్లాడుతూ.. సేకరించిన రైతుల భూములు ధరణి నుంచి తొలగిపోయి రైతు భరోసా కూడా రాక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నట్లు తెలిపారు.
పరిహారం చెల్లించకుండానే ధరణి ఆన్లైన్లో నుంచి రైతుల పేర్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని తాసిల్దార్ అనితకు వినతి పత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, ఎర్రగోకుల జశ్వంత్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

