Yadagirigutta : ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతో యాదగిరిగుట్టలో వ్యక్తి మృతి!
వైద్యుడి నిర్లక్ష్యంతో యాదగిరిగుట్టలో శుక్రవారం వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకి చెందిన అన్నారం శివశంకర్ (26) పట్టణంలోని యోగానంద నిలయంలో వెనుక ప్రాంతంలో సెలూన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 2 : ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకి చెందిన అన్నారం శివశంకర్ (26) పట్టణంలోని యోగానంద నిలయంలో వెనుక ప్రాంతంలో సెలూన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం కడుపునొప్పితో పాటు ఛాతి పట్టివేస్తున్నట్లుగా అనిపించడంతో స్థానికంగా ఉన్న ప్రశాంత్ నర్సింగ్ హోమ్‌కు వెళ్లాడు. వెంటనే అక్కడి ఆర్ఎంపీ వైద్యుడు ఉపేందర్ కడుపునొప్పికి సంబంధించి చికిత్స చేశాడు. కడుపునొప్పి తగ్గడంతో మూత్రం వస్తుందని బెడ్ పైనుండి లేచి వెళ్తున్న క్రమంలో శివశంకర్ ఒక్కసారిగా కుప్పకులాడు.
ఆర్ఎంపీ వెంటనే అప్రమత్తమై వ్యక్తికి అక్సిజన్ అందిస్తూ గంటపాటు పరిశీలనలో ఉంచాడు. కాగా నొప్పి తగ్గక పోవడంతో పాటు చాతి కుడి వైపు విపరీతంగా నొప్పికి గురికావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా గుండెనొప్పిని పసిగట్టిన వైద్యుడు మెరుగైన చికిత్స కోసం భువనగిరికి తరలించాలని సూచించాడు. బందువులు 108కు ఫోన్ చేయగా అంబులెన్స్ అలస్యంగా వచ్చింది. అదే అంబులెన్స్‌లో భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు.
మృతదేహాంతో ఆస్పత్రి వద్ద బైఠాయింపు
శివశంకర్ మృతికి ప్రశాంత్ నర్సింగ్ హోం డైరక్టర్, ఆర్ఎంపీ వైద్యుడు ఉపేందర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు మృతదేహంతో ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. శివశంకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందంటూ, కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యుడు ఉపేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయమై వైద్యుడిని వివరణ కోరగా శివశంకర్ కడుపునొప్పి, ఛాతి బరువుగా ఉందని ఆస్పత్రి రాగా చికిత్స అందించా. వెంటనే కడుపునొప్పికి సంబంధించిన ఇంజక్షన్‌ను గ్లూకోజ్ బాటిళ్లతో కలిపి ఇచ్చా. మొదటగా నొప్పి తగ్గిందని చెప్పాడు. ఆ వెంటనే ఛాతి నొప్పి అంటూ వివరీతంగా ఇబ్బంది పడ్డాడు. 20 నిమిషాల అనంతరం అతనికి గుండె నొప్పి అని పసిగట్టా. వెంటనే మెరుగైన వైద్యం కోసం భువనగిరికి తరలించాలని సూచించా. అంబులెన్స్ అలస్యంగా వచ్చింది. ఒక వైద్యుడిగా తాను చేయాల్సింది చేసినట్లు, తన తప్పేమి లేదని తెలిపాడు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

