సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
కలెక్టర్ పమేలా సత్పతి

భువనగిరి ఆర్బన్ : సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, ప్రాజెక్టు, ఇరిగేషన్ అధికారులు, ఆర్డీవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. బస్వాపూర్ జలాశయం ప్రధాన కాలువ నిర్మాణ పనులకు సంబంధించి భూ నిర్వాసితులకు నష్టపరిహరం వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ ప్రాంతానికి సంబంధించి రూ. 35కోట్ల నిధులు మంజూరయ్యాయని, అదే తరహాలో బస్వాపూర్ జలాశయానికి సంబంధించి నిధులు రానున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యత గల పనులు గుర్తించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వలిగొండ మండలంలోని టేకులసోమారం గ్రామానికి సంబంధించి, ఆలైన్మెంట్ విషయమై కోర్టులో కేసు వేసినందున తిరిగి అలైన్మెంట్ చేపట్టాలని సూచించారు. కోర్టు కేసులో ఉన్న పనులను సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి సంబంధించిన 1.20 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ఇచ్చినందున, సర్వే చేసి, భూసేకరణ పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సేకరించిన భూములు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. సమీక్షా సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, ఇరిగేషన్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

