Bhuvanagiri: పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి.. కలెక్టర్ పమేలాసత్పతి

భువనగిరి కలెక్టరేట్: సంస్కృతి, సంప్రదాయాలతో మట్టి గణపతులను ప్రతిష్ఠించుకుని మహాగణపతిగా ఆరాధించుకోవాల ని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యం లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణ ఏర్పాటు గురువారం ఏర్పాటు చేసిన ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలని కోరారు. త్రాగునీటి వనరులలో నిమజ్జనం చేపట్టడం మూలం గా నీటి అడుగు భాగంలో విగ్రహాల రసాయనాలు పేరుకుపోయి నీటి కాలుష్యం ఏర్పడుతుందని తద్వారా ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం సంభవించే అవకాశాలుంటాయని కలెక్టర్ అన్నారు.
గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలన్నారు. అప్రమత్తంగా ఉండి థర్డ్ వేవ్ ముప్పు నుంచి స్వీయ రక్షణ పొందాల న్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌తివారీ తదితరులున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

