ప్రహారికి అధునాతన విద్యుత్ దీపాలు

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలతో పాటు ఆలయ ప్రహారికి అధునాతన విద్యుత్ దీపాలను అమరుస్తున్నారు. యాదాద్రిలో అనుబంధాలయమైన శివాలయ ప్రహారికి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారాఫిట్ లైట్లను బిగిస్తున్నారు. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయారు చేయించగా గురువారం యాదాద్రికి చేరుకోగా ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి పరిశీలించారు. అర్ధచంద్రకారంలో ఉండి పైభాగం స్వామివారి శంఖుచక్రంతో చూడముచ్చటగా ప్యారాఫిట్ లైట్లను ఉన్నాయి. ఆలయచుట్టు గల ప్రహారికి బిగించిన ఫిల్లర్బాక్స్లపై బిగించనున్నారు. మొత్తం 30 లైట్ల బిగించే పనులు సాగుతున్నాయని అన్నారు.
ఆలయ పనులను పరిశీలించిన ఆర్ట్ డైరెక్టర్
యాదాద్రి ప్రధానాలయంతో పాటు, శివాలయంలో జరుగుతున్న తుది మెరుగుల పనులు ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి గురువారం పరిశీలించారు. ప్రధానాలయంలోని క్యూలైన్లు, విద్యుత్ దీపాల బిగింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శివాలయంలోని తుదిదశకు చేరుకున్న రథశాలను పనులను పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

