కట్టంగూర్, మార్చి 25 : కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. కోతుల దాడిలో గ్రామానికి చెందిన ఓ మహిళకు తీవ్రగాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి ఎల్లమ్మ ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా ఆకస్మాత్తుగా కోతుల గుంపు వచ్చి ఆమెపై దాడి చేయడంతో శరీరం మొత్తం గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటివల గ్రామంలో కోతుల సంచారం పెరిగిపోవడంతో ప్రజలు భాయాందోళనకు గురవుతున్నారు. కోతుల నివారణకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.