తిరుమలగిరి, డిసెంబర్ 8 : ఎస్సారెస్పీ కాల్వకు నీటి విడుదల షెడ్యూల్ను నీటి పారుదల శాఖ డీఈ సత్యనారాయణ విడుదల చేశారు. యాసంగిలో పంటల సాగుకు కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి జనవరి 8 నుంచి ఏప్రిల్ 15 వరకు వారబందీ ప్రకారం నీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. 56 రోజులు 29.028 టీఎంసీల(3,36,000 క్యూసెక్కులు) నీరు అందించనున్నారు.