తుంగతుర్తి, సెప్టెంబర్ 07 : జాతీయ కరాటే పోటీల్లో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు మరోమారు ప్రతిభ కనబరిచారు. 2 స్వర్ణ పథకాలు, మూడు వెండి పథకాలు, 6 కాంస్య పథకాలతో పాటు ప్రశంసా పత్రాల పొందడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తైక ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 తుంగతుర్తి విద్యార్థులు సత్తా చాటారు. కరాటే ప్రత్యేక శిక్షణ నైపుణ్యా రాలు బొంకూరి అరుణ శిక్షణ విభాగంలో ప్రతిరోజు శిక్షణ పొందుతున్న విద్యార్థులతో పాటు, ఫ్రీ కోచింగ్ తీసుకున్నా కస్తూర్బా గాంధీ విద్యార్థులు పలు మెడల్స్ సాధించడం పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.