‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
సీఎం రేవంత్‌రెడ్డి తీరు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తోందని, ఆయన చూస్తున్న శాఖలోనే వేల కోట్ల అవినీతి జరుగుతోందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
– సీఎం రేవంత్‌రెడ్డి శాఖలోనే వేల కోట్ల అవినీతి
– తెలంగాణ సొమ్ము ఆంధ్ర కంపెనీలకు దోచిపెడుతున్నారు
– టెండర్లు వేయొద్దని సీఎం ఆఫీసు నుండే చెప్తున్నారు
– కాదని వేస్తే మా కంపెనీని డిస్క్వాలిఫై చేశారు
– నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను అయినా ఇంత దుర్మార్గమా?
– తక్కువ రేట్ టెండర్లు వద్దు… ఎక్కువ రేటేకే ముద్దు
– వాళ్ల ద్వారా ప్రజల సొమ్ము లూటీనే వీళ్ల లక్ష్యం
– రాష్ట్రం కోసం అప్పు తెచ్చి ఇలా దోచుకుంటారా?
– సింగరేణిని ఇట్లనే అవినీతితో ముంచుతున్నారు.
– సీఎం రేవంత్ తీరు తెలంగాణకు తీవ్ర నష్టం
– ఈ దోపిడిపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తా
– ఓ యూట్యూబర్‌తో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి తీరు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తోందని, ఆయన చూస్తున్న శాఖలోనే వేల కోట్ల అవినీతి జరుగుతోందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.650 కోట్లు ఆంధ్రా కంపెనీలకు దోచిపెడుతున్నారు. “మా కొడుకు నిర్వహిస్తున్న సుశీ హైటెక్ కంపెనీ బద్వేల్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు మూడు ప్యాకేజీలకు కలిపి రూ.650 కోట్లు తక్కువకు టెండర్ వేశాం. మాది పూర్తి ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. మేము వేసిన టెండర్లో చిన్న కౌంటర్ సైన్ లేదనే సాకుతో రాత్రికి రాత్రి డిస్క్వాలిఫై చేశారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్‌పై ఎస్ఈ కౌంటర్ సంతకం లేదన్నారు. కేంద్రంలో కౌంటర్ సైన్ సిస్టమ్ ఉండదని చెప్పి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు రీజినల్ ఆఫీసు నుండే ఎస్ఈ తరపున కౌంటర్ సైన్ పత్రం తెచ్చి ఇచ్చినా పట్టించుకోలేదు. తెల్లారేసరికి మా కంపెనీని డిస్క్వాలిఫై చేశారు. వెంటనే ఆంధ్రా కంపెనీలైన నాగార్జున కన్స్ట్రక్షన్స్, బీవీఎస్ఆర్, జీకేసీలకు ఎక్కువ రేట్‌కు కాంట్రాక్టులు అప్పజెప్పారు. దీనివల్ల తెలంగాణ ప్రజల సొమ్ము రూ.650 కోట్లు ఆంధ్రా కంపెనీలకు దోచిపెట్టినట్లే” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం ఆఫీసు నుండే టెండర్లు వేయొద్దని చెప్పారు
“అంతకుముందు రెండేళ్ల కింద కూడా టెండర్లు పడితే మా కంపెనీని వేయద్దని చెప్పారు. ఈసారి కూడా వేరే వాళ్లు టెండర్లు వేయవద్దని ముందే సీఎం ఆఫీసు నుండే చెప్పారని తెలిసింది. అన్ని అర్హతలు ఉన్నా మేము ఎందుకు ఆగాలి? తక్కువ రేట్ టెండర్లు వద్దు… ఎక్కువ రేటుకే ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ల ద్వారా పైసలు సంపాదించుకోవాలి, తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేయాలన్నదే వీళ్ల లక్ష్యం” అని మండిపడ్డారు.
20 శాతం తక్కువకు కోట్ చేశాం
“నేను రాజకీయాల్లో 2009 నుండి ఉన్నా. మా కంపెనీ దేశంలోని 9 రాష్ట్రాల్లో పనులు చేసింది. దేశంలోనే ఎవరూ చేయని పనిని చైనా బార్డర్లో అరుణాచల్‌ప్రదేశ్‌లో 252 కిలోమీటర్ల రోడ్డును సింగిల్ వర్క్‌గా పర్వతాల్లో ఆర్మీ మూవ్మెంట్ కోసం పూర్తి చేశాం. ఎల్ అండ్ టీ లాంటి కంపెనీలు కూడా చేయలేని పని అది. అటువంటి కంపెనీ బద్వేల్-కొడంగల్ రేడియల్ రోడ్డును కళ్లు మూసుకుని చేయగలదు. మేము 20 శాతం తక్కువకు కోట్ చేశాం” అని తెలిపారు.
రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తా
“మునుగోడు అభివృద్ధికి బిల్లులు ఇవ్వమంటే డబ్బులు లేవు అంటారు. కానీ అప్పు తెచ్చిన డబ్బును ఇలా ఎక్కువ రేట్లకు దోచిపెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. సింగరేణిని కూడా ఇట్లనే ముంచుతున్నారు. తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. బడులు లేవు, ఆస్పత్రులు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ వదిలేసి జీహెచ్ఎంసీలోనే వేల కోట్ల దోపిడీ చేస్తే ఎలా? నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను అయినా సరే ఈ దోపిడీని ఒప్పుకోను. ఈ దోపిడీపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తా. నేను కాంగ్రెస్‌లోనే ఉంటా, ఫైట్ చేస్తా. ధర్మం మా వైపే ఉంది. ఇప్పటికైనా బద్వేల్-కొడంగల్ రోడ్డులో ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి రూ.650 కోట్లు ప్రభుత్వానికి మిగిలించాలి. దీనిపై హైకోర్టుకు వెళ్లాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

