Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
Electrocution | విద్యుత్ షాక్‌కు గురై కౌలు రైతు మృతి చెందిన ఘటన భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
భువనగిరి : విద్యుత్ షాక్ ( Electrocution ) కు గురై కౌలు రైతు మృతి చెందిన ఘటన భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ జమాల్ (38) వ్యవసాయ పొలంలో నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం. జమాల్( Jamal ) కొంతకాలంగా గ్రామానికి చెందిన జక్క పద్మారెడ్డికి చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. శనివారం ఉదయం నారుమడికి నీరు పెట్టే క్రమంలో ఒక మడి నుంచి మరో మడికి నీటిని మళ్లించేందుకు ఇనుప పైపును పైకి లేపాడు. ఈ క్రమంలో పైపు పైన వేలాడుతున్న విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. తీవ్ర విద్యుదాఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

