వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్ 1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ విధుల నుండి సస్పెండ్ అయ్యారు. ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు జెన్కో సీఎండీ హరీష్ కుమార్ సస్పెండ్ చేశారు. వైటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్-1ను 10–15 రోజులుగా షట్డౌన్లో ఉంచడంతో...
– నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కీలక పరిణామం
– జెన్కో సీఎండీ హరీష్, ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు చర్యలు
దామరచర్ల, అక్టోబర్ 15 : యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్ 1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ విధుల నుండి సస్పెండ్ అయ్యారు. ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు జెన్కో సీఎండీ హరీష్ కుమార్ సస్పెండ్ చేశారు. వైటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్-1ను 10–15 రోజులుగా షట్డౌన్లో ఉంచడంతో, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జనరేషన్ లాస్ జరిగినట్లు అభియోగాలు రావడం, సిబ్బంది సమన్వయం, సమీక్షలు, పెండింగ్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నారు. గత నెలలోనూ ఆయిల్ స్టాక్ నిర్వహణ లోపాలపై డిఈ ఐడీఓపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ప్లాంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో సీఎండీ హరీష్ కుమార్ గత నెల నుండి సీఎండీ 4–5 సార్లు ఆకస్మిక తనిఖీలు చేశారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీ సైతం పలుమార్లు తనిఖీలు చేశారు. ఒడిశాలోని మహానది కోల్ బెల్ట్ నుండి బొగ్గు సరఫరా పెంచినా సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. సగం సామర్థ్యంతోనే పని చేస్తున్న కన్వేయర్ బెల్ట్. లోడ్ పెంచితే తెగిపోతున్న వైనం, నాణ్యత, పీజీ టెస్టుల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తున్నాయి. సిబ్బంది కొరతతో 2–3 షిఫ్టులు పని చేస్తున్న సిబ్బంది, యాష్ వాటర్ రికవరీ వ్యవస్థ నిర్వహణ పైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

