సూర్యాపేట నుంచి హ్యాట్రిక్ విజయం
సూర్యాపేట నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వారు ఎవరూ లేకపోగా, ఇప్పుడు ఆ ఘనత గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి దక్కింది.
- వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగదీశ్‌రెడ్డి
- రాజకీయ ఉద్దండులను ఓడించిన వైనం
సూర్యాపేట, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వారు ఎవరూ లేకపోగా, ఇప్పుడు ఆ ఘనత గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి దక్కింది. అంతేకాదు గతంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఒక సారి ఎమ్మెల్యేగా పని చేసిన సంకినేని వెంకటేశ్వర్రావు లాంటి ఉద్దండులతో మూడుసార్లు పోటీ పడి వారిని ఓడించడం గమనార్హం. మధ్య తరగతి కుటుంబం, పెద్దగా రాజకీయ చరిత్ర లేకపోయినప్పటికీ జగదీశ్‌రెడ్డి మాత్రం విద్యార్థి దశ నుంచే రాజకీయాలు వంట బట్టుకొని విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు.
తదనంతరం లా పూర్తి చేసి న్యాయవాది వృత్తి చేపట్టి 2001లో తెలంగాణ కోసం నాటి ఉద్యమ నేత కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన మూడు ఎన్నికల్లో సూర్యాపేట నుంచి మూడుసార్లు గెలుపొందారు. 1952 నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట నియెజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఏ ఒక్కరు కూడా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించలేదు.
అయితే 1952 నుంచి 1956, అలాగే 1962 నుంచి 1967, 1967 నుంచి 1972 వరకు మూడుసార్లు ఉప్పల మల్సూరు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ వరుస విజయాలు కావు. అలాగే 1989 నుంచి 1999 వరకు రెండుసార్లు అంటే పదేండ్లపాటు ఆకారపు సుదర్శన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ ఇద్దరు కాకుండా మరెవరు కూడా రెండు టర్మ్‌ల్లో ఎమ్మెల్యేగా పనిచేయకపోగా గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

