అర్వపల్లి యోగానందుడికి రూ.5కోట్లు
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట్లు విడుదల చేయగా కొంత మేర పనులు చేపట్టారు.
- ఆలయ అభివృద్ధి పనులకు విడుదల చేసిన ప్రభుత్వం
- ఇప్పటికే 1.20 కోట్లతో పనులు
- ఫలించిన ఎమ్మెల్యే కిశోర్ కృషి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట్లు విడుదల చేయగా కొంత మేర పనులు చేపట్టారు. ప్రస్తుత నిధులతో పూర్తి కానున్నాయి. నిధుల విడుదలపై సీఎం కేసీఆర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రెండో యాదాద్రిగా పేరొందిన సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహస్వామి దేవాలయ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసింది. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఆలయ పునరుద్ధరణ కోసం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధులను కోరగా నాడు కోటి రూపాయలను విడుదల చేశారు. తాజాగా శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆలయాన్ని కాకతీయుల కాలంలో అన్నెపురాయుడనే రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
స్వామి దర్శనం కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దీంతో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆలయ ప్రాశస్థిని మరింత చాటి చెప్పాలనే ఉద్దేశంతో విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో గర్భాలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ తన స్వంత నిధుల నుంచి రూ.1.20 కోట్లు మంజూరు చేయగా నిర్మాణ పనులు పూర్తయ్యయి. గర్భాలయ నిర్మాణంతో పాటు ఆలయంలో ధ్వజస్తంభ ఏర్పాటు, గాలి గోపురం, ఆలయం చుట్టూ ప్రాకారం, రథశాల, యాగమండపం, జాతీయ రహదారుల కూడలి వద్ద సింహద్వారం తదితర నిర్మాణాల కోసం ఎమ్మెల్యే కిశోర్ ఇటీవల కాలంలో పలుమార్లు సీఎంను కలిశారు. భారి ఎత్తున ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు
నిధుల విడుదల చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నారో అలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రసిద్ధ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.5 కోట్లు విడుదల చేశారన్నారు. సీఎం కేసీఆర్‌కు స్వామివారి ఆశీస్సులు కలకాలం ఉండాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

