‘నిరుద్యోగ యువత కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణ’
పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి రూపొందించిన ఆన్లైన్ E- క్లాసెస్ యాప్ ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నల్లగొండ, జూన్ 02 : పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి రూపొందించిన ఆన్లైన్ E- క్లాసెస్ యాప్ ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్ల మాటలను నమ్మి మోసం పోయినట్లు అందరూ గ్రహిస్తున్నట్లు తెలిపారు. ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదని, ప్రజలను గాలికి వదిలేసి జిల్లా మంత్రులు హెలికాప్టర్ షికార్లకే పరిమితం అయ్యారన్నారు. కానీ నాడు మంత్రిగా జగదీశ్ రెడ్డి జిల్లా కోసం ఎంతో చేసినట్లు తెలిపారు. యువత కోసం ఆలోచించిన రాకేశ్ రెడ్డికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

‘నిరుద్యోగ యువత కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణ’
త్వరలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక కార్యాచరణ
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో 1.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినట్లు తెలిపారు. అయినా కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేసినట్లు దుయ్యబట్టారు. తప్పుడు లెక్కలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ రెండున్నర ఏండ్లల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని విషయాన్ని అంతా గమనించాలని కోరారు. రేవంత్ రెడ్డి సర్కార్ యువతను తీవ్రంగా మోసం చేసిందన్నారు. అయినా సరే ఎపుడు ఉద్యోగ నోటిఫికేషన్ పడినా ప్రిపరేషన్ కోసం రాకేశ్ రెడ్డి తీసుకువచ్చిన ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. కేసీఆర్తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ వస్తేనే మళ్లీ ఉద్యోగాలు వస్తాయని, త్వరలోనే నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

‘నిరుద్యోగ యువత కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణ’
కాంగ్రెస్ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి
యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. యువత కాంగ్రెస్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాకేశ్ రెడ్డి యువత ప్రిపరేషన్ కోసం కృషి చేస్తుండడం హర్షించదగ్గ విషయం అన్నారు. కానీ గత ఎన్నికల్లో యువత ఓట్లు వేయించుకున్న వ్యక్తి మాత్రం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నట్లు తెలిపారు. యువత గురించి పట్టించుకుంటలేడన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై యువతను రెచ్చగొట్టారు, కానీ ఇవాళ కాంగ్రెస్ సర్కార్ ఏమి చేస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగ నియమాక పత్రాలు అందించారే తప్పా కొత్తగా ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్నారు. రాకేశ్ రెడ్డి తీసుకువచ్చిన యాప్ను ఉపయోగించుకుని యువత ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

‘నిరుద్యోగ యువత కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణ’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

