దేవరకొండ రూరల్, అక్టోబర్ 24 : పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవరకొండ డిపో నుండి ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలైన అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట వంటి పుణ్య క్షేత్రాలకు డీలక్స్ బస్సులను నడుపుతున్నట్టు డిపో ఇన్చార్జి మేనేజర్ పడాల సైదులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ బస్సులు దేవరకొండ డిపో నుండి బయల్దేరి వెళ్తాయన్నారు. పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,400 చార్జీ వర్తిస్తాయని తెలిపారు. పవిత్ర మాసంలో ఈ సదవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.