స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సర్పంచ్‌కు సమాచారం కరువు
చండూరు మండలం గుండ్రపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై వివాదం నెలకొంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బుజ్జిని ఉష అనిల్ రావు...
– చండూరు ఆర్డీవోకు ఫిర్యాదు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి
చండూరు, అక్టోబర్ 01 : చండూరు మండలం గుండ్రపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై వివాదం నెలకొంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బుజ్జిని ఉష అనిల్ రావు గురువారం చండూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక రాజకీయ నాయకులు, రేషన్ డీలర్‌తో కలిసి అధికారులు నిర్వహించారని, అయితే తనతో పాటు ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సర్పంచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి సైతం ఈ కార్యక్రమం గురించి తెలియదని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు, మార్గదర్శకాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత జీపీఓ, అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామ పంచాయతీతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని, విచారణ వివరాలను లిఖిత పూర్వకంగా అందించాలని ఆర్డీవోను కోరారు. తక్షణమే స్పందించిన చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి జిపిఓ కు మెమో జారీ చేయాలని తాసీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, గుండ్రపల్లి సర్పంచ్ ఉజ్జిని ఉష, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, చండూరు మండల ఉపాధ్యక్షుడు కూరపాటి సుదర్శన్, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, చండూరు మండలం యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు, చండూరు మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, పడమటితాళ్ల సర్పంచ్ గాలెంక రాంబాబు, గుండ్రపల్లి ఉప సర్పంచ్ టేకుల వినోద్ రెడ్డి, వార్డు మెంబర్లు తీగల వెంకన్న, వడ్డమల్ల మధు, కాశమల్ల శ్రీనివాసరావు, కాశమల్ల అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

