Kattangur : చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి : ఎస్ఐ రవీందర్
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కట్టంగూర్. జూన్ 30 : చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించబడ్డాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హక్కులు ఎంత ముఖ్యమో, పౌరులకు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజలందరూ సమానమేనని, కుల, మత, వర్ణ భేదం, వివక్ష, అంటరానితనం రూపుమాపాలన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, హక్కులను భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లలను పనికి పంపడం, బాల్య వివాహాలు, డ్రగ్స్ వాడడం, మూఢ నమ్మకాలపై చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కుమార్ రెడ్డి, తాసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాగ్య, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

