మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం
బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
మిర్యాలగూడ, నవంబర్ 20: బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పట్టణశివారులోని వైదేహీ వెంచర్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రి కేటీఆర్ హెలికాఫ్టర్ దిగగానే ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ జిల్లా చైర్మన్ డి నారాయణరెడ్డి, బొకేలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక వాహనంలో మంత్రి కేటీఆర్ హనుమాన్ పేట ఫ్లైఓవర్ నుంచి గాంఢీబొమ్మ మీదుగా రాజీవ్‌చౌక్ వరకు రోడ్‌షో నిర్వహించారు. గణేశ్ ఆలయం సమీపంలో క్రేన్ సహాయంతో భారీ పూలదండతో కేటీఆర్‌కు స్వాగతం పలికారు. మహిళల కోలాటాలతో, యువకుల డ్యాన్స్‌లు పటాకాలు పేలుస్తూ ఆనందంతో ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్‌ను చూసేందుకు దారి వెంట భవనాలపైకి ఎక్కారు. రాజీవ్‌చౌక్ నుంచి గుంటూరు రోడ్డు హౌసింగ్‌బోర్డు, సాగర్‌రోడ్డు హనుమాన్‌పేట, హైద్రాబాద్ రోడ్డు బంగారు గడ్డ వరకు జనాలతో కిక్కరిసింది. రాజీవ్‌చౌక్ పరిసరంలో బిల్డింగ్‌లపై ఎక్కి కేటీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని విన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

