టెన్త్ విద్యార్థినుల సూసైడ్‌పై అట్టుడికిన భువనగిరి
ఆర్తనాదాలు.. ఆగ్రహాలు.. ఆందోళనలు.. తోపులాటలు.. ఉద్రిక్త పరిస్థితులతో భువనగిరి అట్టుడికింది. పదో తరగతి విద్యార్థినుల ఆత్మహత్యలతో పట్టణం ఆగ్రహించింది.
- ఉదయం నుంచే పేరెంట్స్, కుటుంబ సభ్యుల ధర్నా
- మద్దతు తెలిపిన విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు, బీఆర్ఎస్
- ఘర్షణలో పలువురు మహిళలకు గాయాలు
- పోస్ట్‌మార్టం పూర్తి.. స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఆర్తనాదాలు.. ఆగ్రహాలు.. ఆందోళనలు.. తోపులాటలు.. ఉద్రిక్త పరిస్థితులతో భువనగిరి అట్టుడికింది. పదో తరగతి విద్యార్థినుల ఆత్మహత్యలతో పట్టణం ఆగ్రహించింది. బాలికల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాలు, బీఆర్ఎస్ నేతల ఆందోళనలతో దద్దరిల్లింది. బాలికల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఉదయం ఎస్సీ హాస్టల్ ఎదుట ఆందోళనలు..
ఆత్మహత్యల ఘటన నేపథ్యంలో ఉదయం నుంచే ఆందోళనలు షురూ అయ్యాయి. పట్టణంలోని సాయికృప డిగ్రీ కాలేజీలో నడుస్తున్న ఎస్సీ హాస్టల్ ఎదుట భవ్య, వైష్ణవి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గేటు ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఎస్సీ హాస్టల్ ఎదుట ఆందోళన చేసినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంతో అందరూ భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలివచ్చారు. అక్కడే ప్రధాన రహదారిపై అందరూ బైఠాయించారు. రెండు వైపులా వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకానొక సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీస్ స్టేషన్లకు తరలింపు
ఆందోళన చేస్తున్న సమయంలోనే పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. విద్యార్థిను కుటుంబసభ్యులతోపాటు బీఆర్ఎస్కు చెందిన పట్టణ శాఖ నాయకులు, ప్రజా సంఘాలనేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. ఈ క్రమంలో పోలీస్ట్ స్టేషన్లో తమను రక్తాలు వచ్చేలా కొట్టారని విద్యార్థినులు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దుఖఃసాగరంలో కుటుంబ సభ్యులు
ఇద్దరు విద్యార్థినుల విషాద ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో నిండిపోయారు. ఎస్సీ హాస్టల్ వద్ద, ఏరియా ఆస్పత్రి ముందు వారి రోదనలు మిన్నంటాయి. మరోవైపు వైష్ణవి తల్లి లేదు. చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి దివ్యాంగుడు. తన తమ్ముడు సైతం ఆరేండ్ల క్రితమే చనిపోయాడు. ఒక్కగానొక్క కూతురు కూడా చనిపోవడంతో ఆ తండ్రికి కండ్లలో ఏడ్వడానికి నీళ్లు కూడా రావడంలేదు.
హాస్టల్ ఖాళీ..
విద్యార్థినుల ఘటనతో సాయికృప డిగ్రీ కాలేజీలో ఉంటున్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్లిపోయారు. తోటి విద్యార్థులు చనిపోవడంతో వారంతా భయాందోళనకు గురయ్యాయి. అక్కడ ఉండాలంటే జంకుతున్నారు. విద్యార్థులంతా తమ సామాన్లను తీసుకొని పయనమయ్యారు. దీంతో హాస్టల్ ఖాళీ అయ్యింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

