తుంగతుర్తి, మే 11 : నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని తుంగతుర్తి సింగిల్ విండో ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరిచిపోరని ప్రశంసించారు. అనంతరం నర్సులను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాలవరపు సంతోష్, గుండగాని రాము, కేదారి, గుడిపూడి లక్ష్మణ్ రావు, గుజ్జ భాస్కర్, వెంకటనారాయణ, శ్రీనివాస్, అభిలాష్, గిరి పాల్గొన్నారు.