మునుగోడు, జనవరి 24 : ఇంటికి దీపం ఆడపిల్ల అని మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు.. శనివారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో సమావేశం నిర్వహించి సమాజం పట్ల అవగాహన కల్పించారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన మహిళల గురించి వివరించారు. భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలో, పౌష్టికాహార లోపంతో ఎదుర్కొనే సమస్యలు, ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో వెల్లడించారు. విద్యార్థినిలకు వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ లావణ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్, మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.