నీలగిరి, జూన్ 9: నల్లగొండ నగరం మంగళవా రం తెల్లవారు జామున ఉలిక్కిపడింది. సోమవా రం సాయంత్రం దేవరకొండ రోడ్డులో తండ్రీకొడుకుల మృతి ఘట న మరువక ముందే పట్టణ శివారులోని పెద్దబండ ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన శివసత్తి బోతుసాయి(35) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బండరాళ్లతో తలపై మోదడంతో మెదడు బయటకు వచ్చి సంఘటనా స్థలంలోనే మృతి చెం దాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సాయి మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన వెం టనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శాలిగౌరారం ఇంచార్జి సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్సై శంకర్, సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు.
ఆధారాల కోసం క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ను రంగంలోకి దింపారు. సంఘటనా స్థలంలోని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. విషయం తెలియడంతో సంఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు చేరుకున్నారు. సాయి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హత్యకు పాత కక్షలు కారణమా.. లేక మరేదైనా కారణం ఉన్నదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంచార్జి సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్సై శంకర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో హత్య జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్స్ ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తున్నామని నిందితులను త్వరలో పట్టుకుంటామని అన్నారు.
అదుపులో అనుమానితులు..
బోతుసాయి హత్య కేసులో పలువురు అనుమానితులను పోలీసులు ఆదుపులో తీసుకున్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు వ్యక్తులు సాయిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. నిందితులు ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెం దిన వారుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నిందితులు మూడు నెలలుగా గొల్లగూడలో మా రుపేర్లతో అద్దెకు దిగారని, ప్రస్తుతం బొట్టుగూడలో నివాసం ఉంటూ చీరల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మారుపేర్లతో తిరగడమే కాకుండా తెలుగులో మాట్లాడు తూ అందరితో పరిచయాలు పెం చుకున్నట్లు తెలిసింది. సాయి మెడలోని రెండున్నర తులా ల బంగారం, ముక్కు పుడక కోసం స్నేహం నటిస్తూ హత్య చేసి ఉండవచ్చ ని అనుమానిస్తున్నారు.