రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి
ఎంపీటీసీ | హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం కవిత తన భర్తతో వేణుగోపాల్ రెడ్డి

- ఓఆర్ఆర్ సమీపంలో ప్రమాదం
నల్లగొండ: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం కవిత తన భర్తతో వేణుగోపాల్ రెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ దాటిన తర్వాత పెద్దంబర్పేట సమీపంలో ఉన్న యూ టర్న్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ వెనక నుంచి బలంగా గుద్దింది.

దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఎంపీటీసీ కవిత, ఆమె భర్త, టీఆర్ఎస్ పార్టీ నేత అయిన వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను కారులోనుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరు మృతి చెందడంతో అనిశెట్టి దుప్పలపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

