ఎన్‌హెచ్-65పై ప్రమాదాల నివారణకు చర్యలు
65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం గుర్తించిన 17 ప్రాంతాల్లో రూ. 325 కోట్లతో అభివృద్ధి పనులను చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
- రూ. 325 కోట్లతో అభివృద్ధి పనులు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన
- హాజరైన మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యేలు
- డిసెంబర్లో ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడి
చిట్యాల, జూన్ 23 : 65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం గుర్తించిన 17 ప్రాంతాల్లో రూ. 325 కోట్లతో అభివృద్ధి పనులను చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రమాదాల వల్ల కుటుంబాలకు జరిగే నష్టాల గురించి తనకు అనుభవ పూర్వకంగా తెలుసని, అందువల్లే ఎంపీగా, మంత్రిగా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి కేంద్ర మంత్రి గడ్కరి సహకారంతో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం నిధులు తీసుకువచ్చానని చెప్పారు. చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఆదివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తనకు నకిరేకల్ నల్లగొండ రెండు కళ్లు అని, పదవులు కాదు ప్రజలే ప్రాణమని అన్నారు. మూడు నెలల్లో ఉదయ సముద్రం, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి కాల్వలను పూర్తి చేయిస్తానని, తద్వారా నకిరేకల్ నియోజకవర్గానికి సాగునీటి సామర్ధ్యం పెరుగుతుందని తెలిపారు. ఉదయ సముద్రం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రూ. 400 కోట్లు మంజూరు చేశారని, జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీతోపాటు అన్ని కాల్వలను పూర్తి చేస్తానని, ఇతర పెండింగ్ పనులు, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతానని హామీ ఇచ్చారు.
జిల్లాకు రూ.500 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నానని, ప్రాధాన్యత ప్రకారం అన్ని పనులు పూర్తి చేయిస్తానని అన్నారు. చిట్యాల నుంచి భువనగిరి వెళ్లే రోడ్డును 4 లైన్ల రోడ్డుగా విస్తరించి గజ్వేల్‌కు లింక్ చేస్తానని, నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని రోడ్లను ఆర్అండ్బీ రోడ్లుగా మార్చుతానని చెప్పారు. చిట్యాలలో జూనియర్ కాలేజీ, దాతల సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకలకు పెంచుతామని తెలిపారు. కేతేపల్లి వద్ద జాతీయ రహదారి ప్రమాద బాధితుల కోసం అమెరికన్ కంపెనీ సహకారంతో ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని రకాల సహకారం అందిస్తున్నారని, ఇప్పటికే రహదారుల కోసం రూ. 100 కోట్లు మంజూరు చేశారని అన్నారు. బ్రాహ్మణ వెల్లం, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి కాల్వలు పూర్తి అయితే నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రవి, తాసీల్దార్ కృష్ణ, సుంకరి మల్లేశ్‌గౌడ్, పోకల దేవదాసు, కాటం వెంకటేశం, గుడిపాటి లక్ష్మీనర్సింహ, ఎద్దులపురి కృష్ణ, జడల చినమల్లయ్య, వనమా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

