నల్లగొండ, ఏప్రిల్ 4 : నల్లగొండలో ఈ నెల 6, 7వ తేదీల్లో మెగా ఆటోషో జరుగనున్నది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పవన్ మోటర్స్ ప్రధాన స్పాన్సర్స్‌గా జిల్లా కేంద్రంలోని నాగార్జున (ఎన్జీ) డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఆటో షోలో స్కూటీ నుంచి ఆడీ, బెంజ్ కారు వరకు ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రదర్శించనున్నాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ షో ఉండనుండగా వినియోగదారులు తమకు నచ్చిన వాహనాన్ని ఒక లుక్ వేయడంతో పాటు టెస్ట్ డ్రైవ్ చేసుకునే అవకాశం ఉంది. అన్ని కంపెనీలకు చెందిన టూవీలర్లు, కార్లు ఈ షోకు వస్తున్నాయి. ప్రధానంగా మహిళలు, యువతకు కావాల్సిన ప్రతి వాహనం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండలో అందుబాటులో లేని ఎలక్ట్రిక్ వాహనాలు, లగ్జరీ కార్లతో పాటు రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, యువతను ఎట్రాక్ట్ చేసే ైస్టెలిష్ బైక్స్, మహిళలను ఆకర్షించే స్కూటీలు ఈ సారి నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయా కంపెనీల నుంచి తెప్పించి ప్రదర్శనకు పెడుతున్నారు.