చండూరు, జూలై 23 : విద్యుత్ షాక్తో బోరు బావి మోటార్ తీసే మెకానిక్ మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… చండూరు మున్సిపాలిటీ 3వ వార్డు లకినేనిగూడెంకు చెందిన బోరుబావి మోటర్ తీసే మెకానిక్ షేక్ సయ్యద్(38) తండ్రి మదర్ సాబ్ ఈ ఉదయం పుల్లెంల గ్రామానికి చెందిన బద్దుల స్వామి బోరు మోటర్ రిపేర్ కోసం తీసుకెళ్లాడు. ఆ సందర్భంలో కరెంట్ షాక్ గురైనట్లు తెలిపారు. 108 ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.