డిజిటల్ విధానంలో పాఠం పునశ్చరణ
తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. కొంత మంది విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి అక్కడే నివృత్తి చేసుకుంటారు.
- ప్రభుత్వ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్
- ప్రతి పాఠం స్కాన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే సౌలభ్యం
మునుగోడు, డిసెంబర్ 22: తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. కొంత మంది విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి అక్కడే నివృత్తి చేసుకుంటారు. మరికొందరు భయం, బిడియంతో తమ సందేహాలను బయట పెట్టేందుకు సంకోచిస్తారు. అలాంటి వారి కోసం డిజిటల్ విధానంలో పాఠాల పునశ్చరణ విధానాన్ని ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌తో పాఠం మరోసారి వినే అవకాశం కల్పించింది. ఇంటికెళ్లిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠం మళ్లీ వినే సౌలభ్యం ఉన్నది. ఆ రోజు బడికి వెళ్లని విద్యార్థులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
గూగుల్ లెన్స్ సాయంతో..
గూగుల్ లెన్స్ సాయంతో క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆ పాఠం దృశ్య రూపంలో కనిపిస్తుంది. అయితే.. దీనిపై చాలా మంది విద్యార్థులకు అవగాహన లేదు. ఉపాధ్యాయులు చొరవ తీసుకొని మరింత అవగాహన కల్పిస్తే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో ప్రతి పాఠ్యపుస్తకం మొదటి, చివరి పేజీల్లో మాత్రమే క్యూఆర్ కోడ్ ఉండేది. ప్రస్తుతం పుస్తకంలోని ప్రతి పాఠ్యాంశంపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థి తనకు కావాల్సిన పాఠ్యాంశాన్ని స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి డిజిటల్ పాఠాలను వినడంతో పాటు చూడొచ్చు. మొదట్లో ‘దీక్ష’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటేనే పాఠం వినే అవకాశం ఉండేది. ప్రస్తుతం నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపై ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించింది.
సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు
విద్యార్థులకు క్యూఆర్ కోడ్ పునశ్చరణ సమయంలో బాగా ఉపయోగ పడుతుంది. క్యూఆర్ కోడ్‌తో పాఠ్యాంశంలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వీడియో రూపంలో పాఠాలు వినడం ద్వారా సులభంగా అర్థం కావడంతోపాటు ఎక్కువ కాలం
గుర్తుంటాయి.
– ఎన్.యుగంధర్‌రెడ్డి, కల్వకుంట్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు
ఆసక్తిగా ఉంది
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠం మళ్లీ వినడంతోపాటు వీడియో రూపంలో చూడటం ఆసక్తిగా ఉంది. క్యూఆర్ కోడ్‌తో పాఠం అర్థయయ్యే వరకు వినొచ్చు. చూడొచ్చు.
– ఈద శివ, పదో తరగతి, మునుగోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

