Komatireddy Venkatreddy | పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరం చేసేలా రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళన పాలిటెక్నిక్ విద్యార్థులు నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తా వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని 97 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని విద్యార్థులు వేడుకున్నప్పటికీ అవేమీ పట్టనట్టుగా వ్యవహరించారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఏటీసీ సెంటర్ ఎందుకు కట్టించిన.. ఇంజనీరింగ్ విద్యార్థులు రోజూ నా దగ్గరకు వేల మంది వస్తరు.. వాళ్లకు ఎక్కడా జాబ్ లేదు.. స్కిల్ డెవలప్మెంట్ లేదు.. నల్లగొండలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసిర్రా..? ఏటీసీ సెంటర్లు చూసిర్రా..రూ. 86 కోట్లతో కట్టినం.. నెక్ట్స్ పాలిటెక్నిక్ సెంటరోళ్లంతా ఏటీసీ సెంటర్లకు పోవాలి. మీరు ఇక్కడి నుంచి నేరుగా ఏటీసీ సెంటర్‌కు వెళ్లి కేవలం 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే మీకు రూ.50 వేల జాబ్ వస్తదంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. తమ పట్ల కోమటిరెడ్డి వ్యవహరించిన తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడ్డుకున్న పాలిటెక్నిక్ విద్యార్థులు
నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తా వద్ద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని, 97 జీవో రద్దు చేయాలని డిమాండ్
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని వేడుకున్న విద్యార్థులు.. నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చి… https://t.co/nt2cKNGF1z pic.twitter.com/kUTDSiTcen
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026