‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ, డిండి, నేరేడుగొమ్ము, చందంపేట, కొండమల్లేపల్లి...
– దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
– 62 మంది లబ్ధిదారులకు రూ.71.92 లక్షల చెక్కుల పంపిణీ
దేవరకొండ, అక్టోబర్ 15 : పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ, డిండి, నేరేడుగొమ్ము, చందంపేట, కొండమల్లేపల్లి మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు రూ.71,92,000 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని తెలిపారు. ఆడబిడ్డల వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిక్కు నాయక్, నెర్మటి సతీష్ రెడ్డి, కాసర్ల వెంకటేశ్వర్లు, దొండేటి మల్లారెడ్డి, మావిల్ల లక్ష్మినారాయణ, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జర్పుల బధ్యా నాయక్, కిన్నెర హరికృష్ణ, కొర్ర రాంసింగ్, రామావత్ లాలునాయక్, కొప్పుల సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

