జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు
హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్ద తేడా లేకుండా వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
- ఆటపాటలతో యువత సందడి
హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్ద తేడా లేకుండా వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు. యువత డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పట్టణాల్లో సామూహికంగా వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హోలీ సంబురాల్లో పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపారు.

మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవర కొండ నియోజకవర్గాల్లో హోలీ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. హాలియా క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువతీ యువకులు, చిన్నారులు వీధుల్లో కలియ తిరుగుతూ హోలీ నిర్వహించారు.
మిర్యాలగూడటౌన్,మార్చి 7: నియోజకవర్గ వ్యాప్తంగా హోలీ సంబురాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. యువతీ,యువకులు చిన్నా రులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకొన్నారు. సంబురాల్లో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ నాగలక్షి దంపతులు, బీఆర్ఎస్ నాయకులు, యువతీ యు వకులు పాల్గొన్నారు. దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల్లో హోలీ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకొన్నారు.
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల హోలీ పండుగను మంగళవారం ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. హాలియా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రజాప్రతినిధులతో కలసి సంబురాలు జరుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్ సలహదారుడు వెంపటి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతిననిధులు ఎమ్మెల్యేకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హోలీ పండుగలోని రంగుల వలే ప్రజలు ఆనందోత్సవంతో జీవించాలని ఆకాంక్షించారు.
నందికొండ, పైలాన్, హిల్కాలనీల్లో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి నివాసంలో గిరిజనలు ఆటపాటలతో హోలీ నిర్వహించారు.
గుర్రంపోడు, తిరుమలగిరి సాగర్ మండలా ల్లోని గ్రామాలు, గిరిజన తండాల్లో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్ తన నివాసంలో హోలీ వేడుకలను జరుపుకొన్నారు.
త్రిపురారం : మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ తన స్వగ్రామం సత్యంపాడుతండాలో చిన్నారుల మధ్య హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మినీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు రంగులు చల్లుకొని సంబురాలు చేశారు.
దేవరకొండ నియోజకవర్గంలో…
దేవరకొండ : పట్టణంలో హోలీ సంబురాలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. బంజార కాలనీలో మాజీ మున్సిపల్ చైర్మన్ వ్యడ్త దేవేందర్‌నాయక్ స్తానికులతో కలిసి రంగులు చల్లుకొని సంబురాల్లో పాల్గొన్నారు. పలు వార్డుల్లో మహిళలు, ప్రధాన రహాదారుల వెంట యువత హోలీ వేడుకల్లో ఉత్సాహంగా నిర్వహించారు. శంకర్‌నాయక్, గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : మండలంలోని మైనంపల్లి గ్రామంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి హోలీ జరుపుకొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- chemicals
- Holi
- Holi Festivel
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

