Rain : నల్గొండలో హఠాత్తుగా గాలివాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద ఆదివారం అకస్మాత్తుగా ఈదురుగాలుతో కూడిన వాతావరణం భయపెట్టగా.. ఐదు నిమిషాల పాటు వాన దంచికొట్టింది. బలమైన గాలుల తీవ్రతకు జంక్షన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నేలకొరిగి రోడ్డుపై చెల్లాచెదరుగా పడ్డాయి. వర్షం ధాటికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో నల్గొండలో గాలివానతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. బలమైన గాలులు, వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కారు–ఆటో ఢీకొనడంతో ఆటోలో ఉన్న మహిళ కిందపడింది. ఆమె కారు కింద పడబోతుండగా డ్రైవర్ సమయస్ఫూర్తితో వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఐదు నిమిషాలే కురిసినా.. ఈ గాలి–వాన ప్రజలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఐకేపీ సెంటర్(IKP Center) వద్ద వరి ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు గాలికి ఎగిరి పక్కన పడడంతో ధాన్యం కొంతమేరకు తడిసిపోయింది,