Devarakonda | తల్లి ముందే ప్రిన్సిపల్ తిట్టారని.. దేవరకొండలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్లితో కలిసి స్కూల్కు వచ్చింది.
నల్లగొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్లితో కలిసి స్కూల్కు వచ్చింది. అయితే తల్లి ముందే ప్రిన్సిపల్ ఆమెను తిట్టారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుర్తించిన సిబ్బంది బాధితురాలిని ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాలలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
ఇంటర్ విద్యార్థిని ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో శుక్రవారం చోటుచేసుకున్నది. కొండాపూర్ గ్రామానికి చెందిన వెనంకి రవి, జ్యోతి దంపతులకు కూతురు సహస్ర (15), కుమారుడు ఉన్నారు. 2017లో జ్యోతి ఆత్మహత్య చేసుకుం ది. కొంతకాలానికి రవి మరో మహిళను వివాహం చేసుకోగా, అప్పటి నుంచి తండ్రి, పినతల్లితో కలిసి సహస్ర ఉండేది. సహస్రకు ఇటీవల చెవి నొప్పి రావడంతో ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. సహస్ర మృతిపై అ నుమానం ఉందంటూ ఆమె అమ్మమ్మ సుగుణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

